పాన్ కార్డుతో మీ ఆధార్ ను అనుసంధానం చేయలేదని టెన్షన్ పెడుతున్నారా.. రిలాక్స్. ఎందుకంటే కేంద్రం మరికొంత గడువు పెంచింది దీనికోసం. వాస్తవానికి డిసెంబర్ 31 నాటికి ఈ పని పూర్తి చేయాలి. కానీ తాజాగా 2018 మార్చి వరకూ గడువు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరికొంత సమయం చిక్కిందన్న మాట.
ఆధార్,పాన్ లింకింగ్ గడువును 2018, మార్చి 31 వరకు పెంచుతున‍్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఆదాయపు పన్ను దాఖలుకోసం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్ నంబర్ జతచేయడాన్ని తప్పని సరి చేసిన సంగతి తెలిసిందే.