వాళ్లిద్దరూ సెలబ్రిటీలే. ఒకరు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి లోకేష్ భార్య నారా బ్రాహ్మణి. మరొకరు మెగా హీరో రామ్ చరణ్ భార్య భార్య ఉపాసన. వాళ్లిద్దరూ ఒకే చోట. అదీ ఓ సేవా కార్యక్రమంలో. హైదరాబాద్ లో జరిగిన ఓ రక్తదాన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, ఉపాసనలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది.
అదే రక్తదాన కార్యక్రమంలో ఇద్దరూ కలసి పాల్గొన్న ఫోటో. 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయటం ప్రారంభిస్తే ప్రతీ 90 రోజులకు ఒకసారి చొప్పున 60 ఏళ్ల వరకు చేయవచ్చు.. దాదాపు 500 మంది ప్రాణాలను కాపాడవచ్చు అంటూ ఉపాసన కామెంట్ చేశారు.