ఇండిగోను చుట్టుముడుతున్న వర‌స వివాదాలు

Update: 2017-11-13 11:28 GMT

ప్ర‌యాణికుల‌తో దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే విమ‌ర్శ‌లు ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. కానీ ఈ మ‌ధ్య వ‌ర‌స‌పెట్టి చోటుచేసుకుంటున్న సంఘ‌ట‌న‌లు మాత్రం ఈ ఎయిర్ లైన్స్ ఇమేజ్ ను మ‌రింత దెబ్బ‌తీస్తున్నాయి. స్పైస్ జెట్ త‌ర్వాత అత్య‌ధిక మంది విమాన ప్ర‌యాణికులు ఉండేది ఇండిగో ఎయిర్ లైన్స్ లోనే. తెలుగు తేజం..ప్ర‌ముఖ ష‌ట్ల‌ర్ పీ వీ సింధుతో ఇండిగో సిబ్బంది అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించిన తీరు ద‌గ్గ‌ర నుంచి ఈ సంస్థ వివాదాల్లో కూరుకుపోతోంది. ఇది జ‌రిగిన వెంట‌నే మ‌రో ప్ర‌యాణికుడిని ఇండిగో సిబ్బంది దారుణంగా కొట్టాడు. ఇది అయితే పెద్ద దుమార‌మే రేపింది. ఏకంగా కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా జోక్యం చేసుకుని వార్నింగ్ కూడా ఇచ్చారు. వెంట‌నే ఇండిగో కూడా జ‌రిగిన ఘ‌ట‌న‌కు విచారం వ్య‌క్తం చేసింది. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే మ‌రోసారి ఇండిగో వార్త‌ల్లోకి ఎక్కింది.

                                     ఇండిగో సిబ్బంది తోసుకెళుతున్న చ‌క్రాల కుర్చీ నుంచి ఓ మ‌హిళ ప‌డిపోయింది. .లక్నో విమానాశ్రయంలో ఒక దివ్యాంగురాలిని చక్రాల కుర్చీ లో తీసుకుని వెళుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అది అదుపు తప్పడంతో ఆమె కింద పడిపోయింది.దాంతో ఆమె గాయాలపాలయ్యారు. అయితే ఇది కావాలని చేసిన ఘటన కాదని ఇండిగో యాజమాన్యం వివరణ ఇచ్చింది.ఊర్వశి అనే ఆ ప్రయాణికురాలికి ఇండిగో క్షమాపణ చెప్పింది.గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే దివ్యాంగురాలి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన సిబ్బంది స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌టం వ‌ల్లే ఈ సంఘట‌న జ‌రిగింద‌నే విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి.

Similar News