గుజరాత్ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. బిజెపికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పటేళ్ళ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ను ఇరకాటంలోకి పెట్టేంందుకు చర్యలు జోరందుకున్నాయి. అందులో భాగంగానే మంగళవారం నాడు గుజరాత్ టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్ చల్ చేయటం ప్రారంభించింది. ఒక హోటల్ గదిలో పటేల్ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ఓ వీడియో సర్కులేట్ అవుతోంది. దీనిపై పటేల్ మండిపడుతున్నారు. బిజెపి ఎంత నీచానికి అయినా దిగజారుతుందని, తాను పది రోజుల క్రితమే ఈ పరిణామం ఊహించానని అన్నారు. తనను వ్యక్తిగతంగా మలినం చేయాలని బిజెపి యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆ వీడియోతో తనకు సంబందం లేదని ,అది మార్పింగ్ చేసిన వీడియో అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు.
పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ సెక్స్ క్లిప్ అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తుండటం.. దానినే ఆయుధంగా చేసుకుని బీజేపీ తీవ్ర విమర్శలకు దిగింది. అయితే పటేల్ కు ఈ వ్యవహారంలో అనూహ్య మద్దతు లభించింది. దీనిపై దళిత యువ నేత జిగ్నేశ్ మెవానీ స్పందించారు. హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ‘‘హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు’ ’ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్ సలహా ఇస్తున్నారు.