అంటూ బయలుదేరింది ఆ అమెరికా జంట. వాళ్ళు చేసిన పనిచూస్తే ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే. తాము కోరుకున్నట్లు శాశ్వత రోడ్ ట్రిప్ కోసం సొంత ఇంటిని అమ్మేయటంతోపాటు..చేస్తున్న ఉద్యోగాలను సైతం వదిలేశారు. పైగా వాళ్ళు చేసేవీ ఏమీ చిన్నపాటి ఉద్యోగాలు ఏమీ కావు. ఒకరు మార్కెటింగ్ విభాగంలో, మరొకరు ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. వాళ్లిద్దరే జో, ఎమిల్లీ. ఇద్దరి వయస్సు 46 సంవత్సరాలే. ఇప్పుడు వాళ్లిద్దరూ మార్పులు చేసిన ఓ మెర్సిడెస్ వ్యాన్ తో రోడ్లపై వివిధ దేశాలు తిరుగుతున్నారు. వారికి తోడు ఓ కుక్కపిల్ల ఉచ్చి కూడా ఉందనుకోండి. ఇది తమ శాశ్వత రోడ్డు ట్రిప్ అని..తాము దీన్ని ఇలా కొనసాగిస్తూనే ఉంటామని ఈ జంట చెబుతోంది.
తమ అనుభవం ఖచ్చితంగా ఎంతో విలువైనది అని..ఆస్వాదించతగినది అని చెబుతున్నారు వీళ్లిద్దరూ. చేస్తున్న ఉద్యోగాలు..ఉన్న ఇంటిని అమ్మేసి రోడ్డు ట్రిప్ కు బయలుదేరిన ఈ జంట లాంటివారు అరుదుగా ఉంటారని చెప్పొచ్చు. భారతీయులతో పోలిస్తే విదేశీయులు తమ పర్యటనల కోసం భారీ మొత్తాలు వెచ్చిస్తారు. కాకపోతే ఉన్నంతలో సర్దుకుంటూనే సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాలు తిరగటానికి ప్రయత్నిస్తారు తప్ప..లగ్జరీకి ప్రాధాన్యత ఇవ్వరు. అలా తిరగటం చాలా మందికి ఓ సరదా.