Telugu Gateway
Politics

వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరు

వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరు
X

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాల తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే మరో పది శాతం పలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చి ఉండేవన్నారు. అయినా సరే ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. తనకున్న అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవటంలో ఎస్ఈసీ విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదన్నారు. వైసీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఎవరూ కాపాడలేరని అన్నారు.

ధరలు పెంచినందుకు వైసీపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికార దుర్వినియోగంపై ఆధారపడిందని, పోలీసులు ఉన్నంత వరకే వైసీపీ నేతల ప్రతాపమని ఆయన దుయబట్టారు. వైసీపీ నేతలు రెండేళ్లకే మిడిసిపడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఏకగ్రీవాలు చేసుకోవాలన్న వైసీపీ ఆటలు సాగలేదన్నారు. కొత్తవలస టీడీపీ అభ్యర్థికి 250 ఓట్ల మెజారిటీ వచ్చినా రీకౌంటింగ్‌ కోరతారా? టీడీపీ గెలిస్తే రీకౌంటింగ్‌.. వైసీపీ గెలిస్తే ఉండదా? అని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story
Share it