Telugu Gateway
Politics

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. 2019లోనే నీకు పగిలిపోయిందని నీ మనవడు కూడా పాట పాడుకుంటున్నాడు..అందుకే చంద్రబాబు రోడ్లపైకి వచ్చి ఏబీసీడీ అంటున్నారని ఎద్దేవా చేశారు. నీకు దమ్ము ఉంటే..మగాడివి అయితే గుడివాడ రా?. పేకాట ఆడానని నిరూపించు. పిచ్చివాగుడు వాగకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతా అంటూ విమర్శించారు. దోచుకున్న కోట్లాది డబ్బును హెరిటేజ్‌లో దాచుకుంది చంద్రబాబేనంటూ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని అబద్ధాలు చెబుతూ నోటికి ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ తన పాలనలో మద్య నిషేధం విధిస్తే.. చంద్రబాబు ఊరూరా బెల్టుషాపులు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు హయంలో టీడీపీ నేతలు ప్రజల సొమ్మును పందికొక్కుల్లా దోచుకున్నారు.

దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసిన నీచుడు చంద్రబాబు. క్షుద్రపూజలు చేశారు కాబట్టే చంద్రబాబు, లోకేష్ రోడ్డున పడ్డారు. విశాఖలో మోదీ పేరు ఎత్తడానికే చంద్రబాబు భయపడ్డారు. కరోనా కష్టకాలంలో అండగా ఉండాల్సిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారు. చంద్రబాబు మోసం, దగాను ప్రజలు చూశారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారని'' విమర్శించారు. ఓటుకు రూ.5 కోట్లు ఇచ్చి దొరికిపోయిన దొంగ.. చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక దుర్మార్గుడని సాక్షాత్తూ ఎన్టీఆరే వీడియో విడుదల చేశారని మంత్రి గుర్తు చేశారు. టీడీపీకి మనుగడ లేదని ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారన్నారు.

Next Story
Share it