తెలంగాణకు వరదలతో ఐదు వేల కోట్ల నష్టం

Update: 2020-10-15 11:36 GMT

భారీ వర్షాలు..వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణ సాయం కింద 1350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ప్రధాని మోడీ కూడా బుధవారం నాడు ఫోన్ చేసి సీఎం కెసీఆర్ తో మాట్లాడారు. బాధిత రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని ప్రకటించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉంటే 2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే విధంగా నిర్ణీత పంటల సాగు విధానం ఖరారైంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణీత పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు.

Tags:    

Similar News