మద్యం అమ్మకాల సమయాన్ని రాత్రి తొమ్మిది గంటల వరకూ పొడిగిస్తూ ఏపీ సర్కారు జీవో జారీ చేయటాన్ని నారా లోకేష్ తప్పుపట్టారు. ఇది కూడా మద్య నిషేధం అమలులో భాగమేనా అని ప్రశ్నించారు. గతంలో రేట్లు పెంచి మద్యం నిషేధం అమలు కోసం అని చెప్పారని..ఇప్పుడు సమయం పెంచి కూడా అదే మాట చెబుతారా అన్నారు. ఇఫ్పటికే మద్యం దుకాణాలు కరోనా కు హాట్ స్పాట్ లు గా మారాయని నారా లోకేష్ తెలిపారు.
ఈ సమయంలో కూడా సీఎం జగన్ జె ట్యాక్స్ కోసం తపిస్తున్నారని పేర్కొన్నారు.కరోనాతో ప్రజలు రోడ్లపైనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే క్వారంటైన్ కేంద్రాల్లో సరైన వసతలు లేకుండ చేస్తున్నారని, సరైన భోజనం లభించక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.