ఐపీవో స‌న్నాహాల్లో వెరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌

Update: 2021-11-11 13:44 GMT

విద్యార్థులు, నిపుణులు, కార్పోరేట్‌ ఉద్యోగులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌తో పాటుగా హైబ్రిడ్‌ విధానంలో సమగ్రమైన అభ్యాస పరిష్కారాలను అందిస్తున్న వెరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ తమ డీఆర్‌హెచ్‌పీను సెబీ వద్ద సమర్పించింది.ఈ తొలి పబ్లిక్‌ ఆఫర్‌లో భాగంగా 10 రూపాయల ముఖ విలువతో 2000 మిలియన్‌ రూపాయల విలువ కలిగిన వెరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ కంపెనీ, బీఆర్‌ఎల్‌ఎంతో సంప్రదించి చెన్నైలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద రెడ్‌ హెర్రింగ్‌ ప్రోస్పెక్టస్‌ దాఖలు చేయడానికి మునుపే నగదు పరిశీలన కోసం 500 మిలియన్‌ రూపాయల విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రీ – ఐపీఓ ప్లేస్‌మెంట్‌ చేయవచ్చు.

ఈ ప్రీ–ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ఒకవేళ చేపట్టినట్లయితే, బీఆర్‌ఎల్‌ఎంతో సంప్రదించి షేర్‌ ధరను నిర్ణయిస్తారు. ఈ ఆఫర్‌ ద్వారా లభించిన మొత్తాలను కంపెనీ తీసుకున్న ఋణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడంతో పాటుగా వృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. ఈ ఆఫర్‌కు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా సిస్టమాటిక్స్‌ కార్పోరేట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ వ్యవహరించనుంది. బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలలో ఈ షేర్లను లిస్ట్‌ చేయడానికి ప్రతిపాదించారు. ప్ర‌స్తుత మార్కెట్ ప‌రిస్థితుల‌ను ఉప‌యోగించుకుని ప‌లు కంపెనీలు ఐపీవో మార్గం ద్వారా నిధులు స‌మీక‌రించుకుంటున్నాయి. ఇప్పుడు ఐపీవో మార్కెట్ గతంలో ఎన్న‌డూ లేని జోష్ లో ఉంద‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News