అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఇది బిగ్ షాక్ . ఆయన అమెరికాను మరో సారి గొప్పగా తీర్చిదిద్దుతా అని చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో అయన నినాదం కూడా ఇదే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా). ఇప్పుడు పలు దేశాలపై ఎడా పెడా సుంకాలు విధిస్తూ అమెరికాను మరింత సుసంపన్నం చేస్తానని చెపుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అగ్రరాజ్యం మరో సారి షట్ డౌన్ లోకి వెళ్ళింది. ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా షట్ డౌన్ ఎదుర్కొంటోంది. అమెరికా కాంగ్రెస్ నిధుల వినియోగానికి సంబంధించిన బిల్స్ కు క్లియరెన్స్ ఇవ్వకపోవటంతో ఈ షట్ డౌన్ అనివార్యం అయింది. దీంతో పలు కీలక విభాగాల ఉద్యోగులు వేతనాలు లేకుండానే పని చేయాల్సి ఉంటుంది. లేదా వేతనాలు లేని సెలవులు ఇస్తారు.
షట్ డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులు కొనసాగుతాయి. ఇందులో ప్రధానంగా జాతీయ భధ్రత, ఎమర్జెన్సీ మెడికల్ కేర్, సరిహద్దు భధ్రత, విపత్తు సాయం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, పవర్ గ్రిడ్ నిర్వహణ వంటివి ఉంటాయి. వీళ్లకు కూడా వేతనాలు అందవు. అత్యవసరం కానీ వాళ్లకు సెలవులు ఇస్తారు. ఈ షట్ డౌన్ ఎంత కాలం కొనసాగుతుందో ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టం. గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే ఏకంగా 35 రోజుల పాటు ఇది కొనసాగింది. ఇండియా లో బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఎలా ఉద్యోగులకు జీతాలు అందవు..అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయటానికి అవకాశం ఉండదో అలాగే...అమెరికా లో కూడా కాంగ్రెస్ ఆమోదం పొందకపోతే నిధులు ఖర్చు చేయటానికి వెసులుబాటు ఉండదు.