ఆయన వయస్సు 55 సంవత్సరాలు. చదివింది పదవ తరగతే. కానీ చేసేది వైద్యం. చనిపోయిన డాక్టర్ డిగ్రీని ఉపయోగించుకుని ఈ ఫేక్ డాక్టర్ రెండేళ్లుగా వైద్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది. 2019లో చనిపోయిన డాక్టర్ డిగ్రీని ఆసరా చేసుకుని ఆ వ్యక్తి రెండేళ్లుగా అక్కడి ప్రజలకు వైద్యం చేస్తున్నాడు. వైద్య అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితుడి పేరు వినోద్ రాయ్ అని ఉల్ హన్స్ పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకూ ఇంకా ఈ ఫేక్ డాక్టర్ ను అరెస్ట్ చేయలేదు.