అంచనాలకు భిన్నంగా ముందుకు

Update: 2024-11-13 05:28 GMT

మార్కెట్ అంచనాలకు భిన్నంగా మార్కెట్లో స్విగ్గీ షేర్లు లిస్టింగ్ రోజు దుమ్మురేపాయి. మార్కెట్ బలహీనంగా ఉన్న సమయంలో...అది కూడా పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ స్విగ్గీ షేర్లు లాభాలు గడించటం ఆసక్తికర పరిణామం. అయితే ఐపీవో లో షేర్లు దక్కించుకున్న వాళ్లకు మాత్రం లిస్టింగ్ రోజు లాభాలు దక్కాయని చెప్పాలి. అతి పెద్ద ఐపీవో లు అయిన హ్యుండయ్ లిస్టింగ్ చూసిన తర్వాత స్విగ్గీ కూడా ఆఫర్ ధర కంటే దిగువనే నమోదు అవుతుంది అనే అంచనాలు వెలువడ్డాయి. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) కూడా ఇదే సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ అంచనాలకు భిన్నంగా మార్కెట్ లో అంటే అటు బిఎస్ఈ, ఇటు ఎన్ ఎస్ ఈ లోనూ ఈ షేర్లు ఆఫర్ ధర కంటే ఎక్కువగా అంటే వరసగా నాలుగు శాతం, ఎనిమిది శాతం ప్రీమియం తో నమోదు అయ్యాయి. స్విగ్గీ ఐపీఓ కు పెద్ద ఎత్తున బజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.

                                                   అయితే కొంత మంది మాత్రం ఈ ఐపీవో కంటే లాభాల్లో ఉన్న జొమాటో షేర్లు కొనుగోలు చేయటం బెటర్ అని సూచించారు. ఎందుకంటే స్విగ్గీ ప్రస్తుతం నష్టాల్లోనే ఉంది. మార్కెట్ వాటా పరంగా, వ్యాపార పరంగా కూడా స్విగ్గీ కంటే ప్రస్తుతానికి జొమాటో నే ముందు వరసలో ఉంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లిస్టింగ్ రోజు స్విగ్గీ మార్కెట్ లో మెరుపులు మెరిపించింది. మార్కెట్ లో పలు కీలక షేర్లు నష్టాలబాటలో సాగుతున్నా కూడా ఈ షేర్లు మాత్రం మంచి లాభాలు నమోదు చేయటం విశేషం. స్విగ్గీ ఒక్కో షేర్ ను 390 రూపాయల ధరతో ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఉదయం పది గంటల నలభై నిమిషాల సమయంలో స్విగ్గీ షేర్లు బిఎస్ఈ లో 444 రూపాయల గరిష్ట స్థాయికి చేరాయి. అయితే మార్కెట్ క్లోజింగ్ వరకు ఈ దూకుడు ఉంటుందా లేదా అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News