అయితే ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండేందుకు ఐపీవో సమయంలోనే ఒక రూపాయి పేస్ వేల్యూ తో షేర్లు జారీ చేస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ..స్విగ్గీ ధర పై ఇన్వెస్టర్ల లో పలు సందేహాలు ఉన్నాయి. పైగా ప్రస్తుతానికైతే కంపెనీ ఇంకా నష్టాల్లోనే ఉంది. లాభాల బాటలో పయనించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. స్విగ్గీ ఐపీవో ద్వారా మార్కెట్ నుంచి ఏకంగా 11300 కోట్ల రూపాయలు సమీకరిస్తోంది. ఇందులో కొన్ని షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటే ..మరి కొన్ని షేర్లు ఫ్రెష్ గా కూడా జారీ చేస్తున్నారు. స్విగ్గీ ఐపీవో అనగానే సాధారణ ఇన్వెస్టర్లు వెంటనే ఇప్పటికే మార్కెట్ లో ఉన్న జొమాటో షేర్లతో పోల్చిచూస్తున్నారు. జొమాటో ఒక రూపాయి ముఖ విలువ గల షేర్లను 76 రూపాయల లెక్కన జారీ చేసి మార్కెట్ నుంచి 9375 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇప్పుడు కంపెనీ షేర్లు 249 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ షేర్ల 52 వారాల గరిష్ట ధర 298 రూపాయలుగా ఉంది. పైగా జొమాటో ఇప్పుడు లాభాలు కూడా ఆర్జిస్తోంది. మరో వైపు అటు జొమాటో, ఇటు స్విగ్గీ లు ఫుడ్ డెలివరీ తో పాటు క్విక్ కామర్స్ బిజినెస్ లో కూడా ఉన్నారు.
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ అంచనాల ప్రకారం అయితే క్విక్ కామర్స్ బిజినెస్ తో పాటు ఫుడ్ డెలివరీ బిజినెస్ లో కూడా జొమాటో నే చాలా ముందు ఉంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే దేశంలోనే అతి పెద్ద ఐపీవో తో మార్కెట్ లోకి వచ్చిన హ్యుండయ్ కూడా ఆఫర్ ధర కంటే దిగువనే లిస్ట్ అయింది. దేశంలోనే రెండవ అతి పెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న హ్యుండయ్ కు కూడా ఇప్పుడు తిప్పలు తప్పలేదు. మరో వైపు ప్రముఖ షాపుర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీవో కూడా కష్టం మీదే సబ్ స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ మాత్రం పూర్తి గా కూడా కాలేదు. నవంబర్ నాలుగున లిస్ట్ కానున్న ఈ కంపెనీ షేర్లు కూడా ఆఫర్ ధర వద్ద లేదంటే మైనస్ కే నమోదు అయ్యే అవకాశం ఉంది అని జీఎంపీ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ లో ఎంతో బజ్ ఉన్న స్విగ్గీ ఐపీవో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ ఇష్యూ లో కూడా పెద్ద లిస్టింగ్ బెనిఫిట్స్ ఉండే అవకాశం లేదు అనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.