కొత్త రకాల కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటుందని నిర్ధారణ
రష్యాలో ఉపయోగానికి అనుమతి
ప్రపంచ వ్యాప్తంగా ఇఫ్పటివరకూ వచ్చిన కరోనా వ్యాక్సిన్లలో చాలా వరకూ డబుల్ డోస్ వ్యాక్సిన్లే. రెండు డోసులు వేసుకుంటేనే ప్రతి మనిషి శరీరంలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు డెవలప్ అయితాయని నిర్ధారించారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ ఇప్పుడు సింగిల్ డోస్ 'సుత్నిక్ లైట్' వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. రష్యాలో ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఉపయోగానికి అధికారికంగా అనుమతి కూడా లభించింది. రష్యాలోని మాస్ వ్యాక్సినేషన్ కింద చేపట్టిన కార్యక్రమంలో ఈ సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ 79.4 శాతం సమర్ధతను చూపించినట్లు నిర్దారించారు. 2020 డిసెబర్ 5 నుంచి 2021 ఏప్రిల్ ల మధ్య కాలంలో దీనిపై పరిశోధనలు సాగాయి. రెండు డోసుల వ్యాక్సిన్ కంటే స్పుత్రిక్ లైట్ 80 శాతం సమర్ధతను చూపించటం ఎంతో సానుకూల పరిణామంగా ప్రకటించారు.
మరో కీలక విషయం ఏమిటంటే అన్ని రకాల కరోనా కొత్త స్ట్రెయిన్స్ పై కూడా స్పుత్రిక్ లైట్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గమలేయా సెంటర్ లేబరేటరీ టెస్ట్ ల్లో నిర్ధారణ అయిందని తెలిపారు. తొలి, రెండవ దశ పరీక్షల్లో ఎంతో సమర్థవంతం గా యాంటీబాడీలను ఇది ఉత్పత్తి చేసిందని తేల్చారు. స్పుత్నిక్ లైట్ వ్యాక్సినేషన్ తర్వాత ఎలాంటి ప్రతికూల ఫలితాలు కూడా రాలేదన్నారు. 2021 మే 5 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 20 మిలియన్ల మంది స్పుత్నిక్ వీ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. మరో కీలక అంశం ఏమింటే కొత్తగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ కు సాధారణ వ్యాక్సిన్ నిల్వ, రవాణా సదుపాయలు ఉంటే సరిపోతుందని తెలిపారు.