ఆస్పత్రిలో సౌరవ్ గంగూలీ

Update: 2021-01-02 10:04 GMT

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం నాడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. తన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన్ను ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సౌరవ్‌కు గుండెపోటుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం డాక్టర్‌ సరోజ్‌ మోండల్‌ పర్యవేక్షణలో ఆయన‌ చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం సౌరవ్‌కు యాంజియో ప్లాస్టీ చేయనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

స్పోర్ట్స్‌ జర్నలిస్టు బొరియా మజుందార్‌ గంగూలీ అస్వస్థతకు సంబంధించి ట్విటర్‌లో వివరాలు వెల్లడించారు. ఉదయం నుంచే ఆయన నలతగా ఉన్నారని తెలిపారు. యాంజియో ప్లాస్టీ అనంతరం సౌరవ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్‌ అయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఆయన స్వల్ప గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. గంగూలీ త్వరగా రికవరీ కావాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News