భారతీయ కరెన్సీలో చూస్తే ఈ మొత్తం నెలకు వెయ్యి రూపాయలకు పైనే ఉంటుంది. మరి ఇండియా లో ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. వెరి ఫైడ్ ఖాతాలకు ఛార్జ్ చేయటం మాత్రం పక్కా అని తేల్చారు.. అయితే క్రమంగా ఒక్కో దేశం లో ఇది అమలు చేసుకుంటూ రానుంది. ప్రకటనల ఆదాయం తగ్గటం పేస్ బుక్ కూడా ఈ మోడల్ వైపు వచ్చింది అని చెపుతున్నారు. ఇప్పటికే మెటా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. వెరి ఫైడ్ ఖాతాలకు నకిలీల బెడద తప్పటం తో పాటు పలు ప్రత్యేకతలు ఉంటాయని చెపుతున్నారు. తర్వాత సాధారణ యూజర్లకు కూడా నామమాత్రపు ఫీజు పెట్టె అవకావం ఉందని చర్చ సాగుతోంది. అలా చేసిన కంపెనీకి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని అంచనా. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో.