ఈ పతనం ఆగేదెప్పుడు?!

Update: 2025-01-13 12:24 GMT

డాలర్ తో పోలిస్తే రూపాయి విలువగా వరసగా పతనం అవుతుండటం స్టాక్ మార్కెట్ లో ప్రకంపనలు రేపుతోంది. గత కొన్ని రోజులుగా రూపాయి డాలర్ తో పోలిస్తే రూపాయి కొత్త కొత్త కనిష్ట స్థాయిలకు చేరుతూ వస్తోంది. సోమవారం నాడు రూపాయి 86 .61 రూపాయల వద్ద ముగిసింది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే దేశీయ దిగుమతుల వ్యయం మరింత పెరగటంతో పాటు వాణిజ్య లోటు పెరిగే అవకాశం ఉంది. ఇది మార్కెట్ సెంటిమెంట్ పై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది అని నిపుణులు చెపుతున్నారు. సోమవారం నాడు బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1049 పాయింట్స్ పతనం అయింది. 

                                          ఎన్ఎస్ ఈ నిఫ్టీ 345 పాయింట్ల మేర నష్టపోయింది. తాజాగా మార్కెట్ పతనం కావటానికి రూపాయి తో పాటు పలు అంతర్జాతీయ అంశాలు కూడా ప్రభావితం చేశాయి. పలు కీలక షేర్ల ధరలు కూడా 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. మూడవ త్రైమాసిక ఫలితాల ఆధారంగా మార్కెట్ కదలికలు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు రూపాయి పతనం ఆపేందుకు అటు కేంద్రం, ఇటు ఆర్ బిఐ తీసుకునే నిర్ణయాలు కూడా కీలకం కానున్నాయి. అయితే కేంద్రం రూపాయి విషయంలో ఇప్పటి వరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.దీంతో ఈ పతనం ఎప్పుడు ఆగుతుందో అన్న టెన్షన్ మదుపర్ల లో ఉంది. అయితే ఇప్పటివరకు అయితే మార్కెట్ ను డ్రైవ్ చేసే సానుకూల అంశాలు పెద్దగా ఏమీ కనిపించటం లేదు అని...బడ్జెట్ మాత్రమే మార్కెట్ లో జోష్ తీసుకురాగలదు అనే అంచనాలు ఉన్నాయి.






 

Similar News