కపిల్ దేవ్ కు గుండెపోటు

Update: 2020-10-23 11:50 GMT

భారత్ కు 1983లో ప్రపంచ కప్ అందించిన అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ కు శుక్రవారం నాడు గుండె పోటు వచ్చింది. ఆయన్ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్ళటంతో డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు ప్రకటించారు. కపిల్‌ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తున్నారు. హర్యానా హరికేన్‌గా కపిల్ దే వ్ కు పేరుంది. 

Tags:    

Similar News