జియో ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ 'ప్ర‌గ‌తి'

Update: 2021-10-25 12:04 GMT

రిల‌య‌న్స్ మ‌రో సంచ‌ల‌నం న‌మోదు చేయ‌నుందా?. రిల‌య‌న్స్ జియో ఫోన్ నెక్ట్స్ ఇప్పుడు మొబైల్ మార్కెట్లో ఉన్న గ‌ట్టి పోటీని ఎలా ఎదుర్కోబోతుంది. ఏ కంపెనీ ఫోన్ల కు జియో దెబ్బ‌త‌గ‌ల‌నుంది. ఎక్కువ‌గా ఎవ‌రిపై ఈ ప్రభావం ప‌డ‌నుంద‌నే అంశంపై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ త‌రుణంలో జియో ఫోన్ నెక్ట్స్ కు సంబంధించి సోమ‌వారం నాడు ప‌లు అప్ డేట్స్ వ‌చ్చాయి. ఈ ఫోన్ లో ఉండే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కు ప్ర‌గ‌తిగా పేరు పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు. జియో​ ఫోన్‌ను అందరూ వినియోగిస్తూ మ‌రింత ప్రగతి (ప్రొగ్రెస్‌) సాధించాలని ఉద్దేశంతో ఈ పేరు పెట్టినట్లు జియో తెలిపింది. ఈ ఫోన్‌ కనెక్టివిటీ సమస్య లేకుండా ఉండేందుకు క్వాల్కమ్‌ ప్రాసెసర్‌, వాయిస్‌ అసిస్టెంట్స్‌, టాన్స్‌ లేట్‌, ఈజీ అండ్‌ స్మార్ట్‌ కెమెరా, ఆటోమెటిక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌, జియో - గూగుల్‌ యాప్స్‌ ప్రీలోడెడ్‌ ఫీచర్లు పొందుప‌ర్చారు.

దీపావళికి విడుల కానున్న ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్‌ జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జియో ఫోన్‌లో భారతీయత ఉట్టిపడేలా 'ఆపరేటింగ్‌ సిస్టంస‌కు సంప్ర‌దాయ పేరు పెట్టి జియో అధినేత ముఖేష్‌ అంబానీ అంద‌రిన‌నీ ఆశ్చర్యానికి గురి చేశారు. గూగుల్‌ అక్టోబర్‌ 4 సరికొత్త ఓఎస్‌ ఆండ్రాయిడ్‌ 12 రిలీజ్‌ చేసింది. దీపావ‌ళికి విడుదల కానున్న జియోలో ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు తొలిసారి ఆండ్రాయిడ్‌ 1.0 వెర్షన్‌ సెప్టెంబర్‌ 23,2008 లో విడుదలైంది. జియో స‌ర్వీసులు దేశంలో పెద్ద సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. మార్కెట్లోకి వ‌చ్చిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే జియో అత్య‌ధిక మార్కెట్ వాటా ద‌క్కించుకుంది. అదే స‌మ‌యంలో జియో ఎంట్రీ త‌ర్వాతే మొబైల్ డేటా ధ‌ర‌లు వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

Tags:    

Similar News