ట్రంప్ ఓడిపోతే మార్కెట్లు ఢమాల్

Update: 2020-11-02 06:01 GMT

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలైతే స్టాక్ మార్కెట్లు ఢమాల్ అంటాయని బిలియనీర్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ వెల్లడించారు. ట్రంప్ ఓటమి పాలు అయితే అమెరికాతో పాటు అంతర్జాతీయంగా స్టాక్స్ కు అసలు సమస్యలు ప్రారంభం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ప్రతిపాదించిన పన్ను రాయితీలు అమెరికా మార్కెట్ కు, తైవాన్, చైనాలకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. అమెరికా స్టాక్ మార్కెట్ కు సంబంధించిన అధిక విలువ కొనసాగాలంటే అది కేవలం ట్రంప్ విజయం ద్వారానే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.

ఆయన 'బ్లూంబెర్గ్' తో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్లు అమెరికా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఫలితాల తర్వాత ఆయా మార్కెట్లు దిశను నిర్ణయించుకోనున్నాయి. కరోనా సమయంలో కూడా అమెరికాలోని పలు అగ్రశ్రేణి కంపెనీల షేర్లు దూసుకెళ్ళాయి. దీంతో ఆయా కంపెనీల అధినేతలకు బిలియన్ల సంపద వచ్చిపడింది. అయితే అవి ఉంటాయా ఊడ్చిపెట్టుకుపోతాయా అన్నది ఎన్నికల ఫలితాలు నిర్దేశించనున్నాయి.

Tags:    

Similar News