మిస్ యూనివర్శ్. ఈ కిరిటం దక్కించుకునేందుకు ఉండే పోటీ అంతా ఇంతా కాదు. అందంగా ఉండటమే కాదు..అందమైన సమాధానాలు కూడా ఇందులో కీలక భూమికి పోషిస్తాయి. అటువంటి మిస్ యూనివర్శ్ టైటిల్ మరోసారి దక్కించుకుంది. అది కూడా 21 సంవత్సరాల తర్వాత. సోమవారం నాడు ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. కోట్లాది మంది భారతీయుల ఆశలను నిజం చేసి.. విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారత యువతి హర్నాజ్ సంధు.
ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్ యూనివర్స్ పోటీల్లో హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది . ఏకంగా ఏనభై మందితో పోటి పడి విశ్వ విజేత కిరీటం దక్కించుకుంది. ఇటీవలే లివా మిస్ దివా యూనివర్స్‌గా నిలిచింది మిలీనియం గర్ల్ హర్నాజ్. గతంలో భారత్ నుంచి సుస్మితాసేన్, లారాదత్త తర్వాత మిస్ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించని హర్నాజ్.. పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది.