క్యాసినోలు తెరిచిన గోవా

Update: 2021-09-22 09:09 GMT

గోవా లో కరోనా కేసులు తగ్గటంతో క్యాసినోలు కూడా ఓపెన్ చేసారు. అయితే క్యాసినో లోకి వెళ్లాలంటే రెండు డోసుల వాక్సిన్ తీసుకోవటంతో పాటు నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇస్తారు . పర్యాటక సీజన్ లో అధిక ఆదాయం కెసినో ల ద్వారానే వస్తుంది. అందుకే సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచే గోవా లో కేసినో లు ప్రారంభం అయ్యాయి. కేసు లు తగ్గటం తో కేసినో లతో పాటు స్పా లు, మసాజ్ సెంటర్స్ ఓపెన్ చేయటానికి అనుమతి ఇచ్చారు. అయితే సన్ బర్న్ వంటి మెగా ఈవెంట్స్ నిర్వహణకు గోవా ప్రభుత్వం సిద్ధముగా లేదని స్పష్టం చేసారు.

రాష్ట్రములో కరోనా కేసులు బాగా తగ్గినట్లు నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రములో ఆర్థిక కార్యకలాపాలు పెంచటానికి కూడా ఇది దోహదం చేస్తుంది అని అన్నారు. గోవాలోని మండోవి నదిలో ఆరు క్యాసినోలు ఉంటే ..నగరంలోని ప్రముఖ హోటల్స్ లో పన్నెండు క్యాసినోలు నడుస్తున్నాయి. రాష్ట్రములో ఉద్యోగాల కల్పన, ఆదయ సముపార్జనకు క్యాసినోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గోవా ప్రభుత్వానికి వీటి ద్వారా ప్రతి సంత్సరం 320 కోట్ల రూపాయలు లైసెన్స్ ఫీజు కింద వస్తుంది.ప్రస్తుతం గోవాలో కరోనా కేసు లు 700వరకు ఉన్నాయి .

Tags:    

Similar News