బ్యాంకు రుణాల మోసానికి సంబంధించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్ ) మాజీ ప్రమోటర్లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. 8180 కోట్ల రూపాయల మేర రుణాల మోసానికి సంబంధించిన కేసులో డీసీహెచ్ఎల్, మాజీ ప్రమోటర్లు టి. వెంకట్రామిరెడ్డి, టి. వినాయక్ రవి రెడ్డిలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు సంబంధించి వీరిద్దరికి చెందిన 122.15 కోట్ల రూపాయల స్థిరాస్తులను సీజ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.
ఈ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సీజ్ చేసిన వాటిలో ఢిల్లీ, హైదరాబాద్, చెన్నయ్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో మొత్తం 14 ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ ఆస్తులు ఏవీ కూడా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీల్ టీ) పరిధిలో లేవని తెలిపారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇది రెండవ అటాచ్ మెంట్ గా సమాచారం. 2015లో ఈడీ డీసీహెచ్ ఎల్ తోపాటు అప్పటి యాజమాన్యంపై పీఎంఎల్ఏ కింద విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈడీ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి.