జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ ఐ7 కార్లలో కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటి అంటే ఏకంగా కారులో కూర్చుని 'థియేటర్ ' లో సినిమా చూసిన అనుభూతిని పొందవచ్చని చెబుతోంది. దీని కోసం బీఎండబ్ల్యూ సంస్థ వెనక సీట్లలో కూర్చున్న వారు చూసేలా 31.3 ఇంచుల పనోరమిక్ డిస్ ప్లే తో కూడిన థియేటర్ స్క్రీన్ అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఈ కార్లు ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు..ఈ ప్రైవేట్ సినిమా స్క్రీన్ ఏకంగా 8కె క్వాలిటీ కలిగి ఉంటుందని తెలిపారు.
వాస్తవానికి ఇలా కార్లలో సినిమాలు చూసేందుకు వీలుగా ఎప్పుడు పలు డిస్ ప్లేలు అందుబాటులోకి వచ్చినా వాటి పరిమాణం చాలా చిన్నదిగా ఉండేది. అయితే ఒకప్పుడు వీటికి ఉన్న క్రేజ్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది.. ఈ తరుణంలో బీఎండబ్ల్యూ తన ఎలక్ట్రిక్ కార్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి తేనుండటం విశేషం. అంతే కాదు..ఈ ప్రైవేట్ సినిమా స్క్రీన్ లో ఇన్ బిల్ట్ అమెజాన్ ప్రైమ్ ను పొందుపర్చనున్నారు. దీంతో సినిమాలే కాకుండా ఇతర కార్యక్రమాలు చూసే వెసులుబాటు ఇందులో ఉంటుంది.#