పంజాబ్ లో కలకలం. ప్రధాని నరేంద్రమోడీ కాన్వాయ్ ను నిరసనకారులు ఏకంగా 15 నుంచి 20 నిమిషాలు అడ్డుకున్నారు. రైతు చట్టాలకు సంబంధించి పంజాబ్ రైతులే కేంద్రంపై తీవ్రస్థాయిలో పోరాటం చేసిన విషయం తెలిసిందే. ప్రదాని మోడీ బుధవారం నాడు ఓ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన పయనిస్తున్న మార్గంలో మోడీ కాన్వాయ్ ఓ బ్రిడ్జిపైన ఉన్న సమయంలో నిరసనకారులు అడ్డుతగిలారు. దీంతో దేశంలో కలకలం రేగింది. ఇది తీవ్ర భద్రతా ఉల్లంఘనగా పరిగణించారు. ఈపరిణామాలపై బిజెపి జాతీయ ప్రెసిడెంట్ జె పి నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పంజాబ్ సీఎం చన్నీ తమ ఫోన్ కాల్స్ స్వీకరించటంలేదని..సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. తాజా పరిణామాలతో ప్రధాని మోడీ తన ర్యాలీని కూడా రద్దు చేసుకున్నారు. బిజెపి చేతుల్లో చిత్తుగా ఓటమి తప్పదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేసిందని బిజెపి మండిపడుతోంది.
'స్కిల్'