ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వ‌చ్చేశారు

Update: 2022-02-14 14:34 GMT

కొత్త యాజ‌మాన్యం. కొత్త సీఈవో, ఎండీ. టాటా గ్రూపు ఎయిర్ ఇండియాలో వేగంగా మార్పులు చేస్తోంది.అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ఎయిర్ లైన్స్ కు పున‌ర్ వైభ‌వం తెచ్చేందుకు వీలుగా చ‌క‌చ‌కా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే టాటా స‌న్స్ బోర్డు ఎయిర్ ఇండియా కు కొత్త ఎండీ, సీఈవోని నియ‌మించింది. ట‌ర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన మాజీ ఛైర్మ‌న్ అయిన ఇల్క‌ర్ ఐసీకి ఈ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇల్క‌ర్ వ‌య‌స్సు 51 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ఇస్తాంబుల్ లో జ‌న్మించారు.

                                      విమాన ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న సార‌ధిగా ఉంటార‌ని టాటా గ్రూప్ ఛైర్మ‌న్ చంద్ర‌శేఖ‌రన్ ఈ కొత్త నియామ‌క ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియాను న‌వ శ‌కం వైపు న‌డిపించేందుకు ఇల్క‌ర్ ను ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిపారు.అవ‌స‌రమైన నియంత్ర‌ణా సంస్థ‌ల అనుమ‌తుల అనంత‌రం ఆయ‌న 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. ఆయ‌న బిల్‌కెంట్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిష్టేషన్‌ పట్టా పొందారు. అనంతరం యూకేని లోలీడ్స్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో పట్టా సాధించారు. టర్కీ ఫుడ్‌ ఫెడరేషన్‌ బోర్డ్‌ మెంబర్‌గా కూడా ఇల్క‌ర్ ఉన్నారు.

Tags:    

Similar News