అదానీ గ్రూపునకు చెందిన మరో కంపెనీ మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఇటీవల స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కంపెనీ ఈక్వీటీ షేర్ల విక్రయం ద్వారా 3600 కోట్ల రూపాయలు సమీకరించింది. కంపెనీ షేరు ధరను230 రూపాయలు నిర్ణయించారు. ఫార్చూన్ బ్రాండ్ పేరుతో వంట నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఈ కంపెనీ అదానీ గ్రూప్, సింగపూర్ కు చెందిన విల్మర్ సంస్థల జాయింట్ వెంచర్. అదానీ విల్మర్ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనే వచ్చింది. షేర్ల కేటాయింపు పూర్తవటంతో మంగళవారం నాడు ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్ ఎస్ఈల్లో లిస్ట్ అయ్యాయి.
తొలుత ఆఫర్ ధర 230 రూపాయల కంటే తక్కువగా 221 రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి. అనంతరం క్రమక్రమంగా పెరుగుతూ 252 రూపాయల గరిష్ట స్థాయికి చేరాయి. సరిగ్గా ఉదయం 10.40 గంటల సమంయలో ఈ షేర్లు బీఎస్ఈలో 251.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ అప్పులు తీర్చుకోవటంతో..విస్తరణ కార్యకలాపాలకు ఉపయోగించనుంది.