నిధుల సమీకరణ విషయంలో అదానీ ఎయిర్ పోర్ట్స్ దూకుడు మీద ఉంది. గ్రూపు ఆధీనంలోని విమానాశ్రయాల అభివృద్ధి కోసం 250 మిలియన్ అమెరికన్ డాలర్లు సేకరిస్తోంది. స్టాండర్డ్ చార్టెడ్, బార్క్లేస్ బ్యాంక్ ల కన్సార్టియం ఈ నిధులు అందజేస్తున్నాయి. ఈ 250 మిలియన్ యూఎస్ డాలర్లు కాకుండా..మరో 200 మిలియన్ యూఎస్ డాలర్లు ఆప్షన్ కూడా పెట్టుకుంది కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా విమానాశ్రయాల వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ఈ నిధులను ఉపయోగిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అదానీ ఎయిర్ పోర్ట్స్ చేతిలో ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ముంబయ్ లో కొత్తగా నిర్మిస్తున్న నవీ ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 750 మిలియన్ యూఎస్ డాలర్లు సేకరించిన విషయం తెలిసిందే.