Full Viewఅసలు ఆయన ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు. దీని వెనక ఉన్న కారణాలేంటి?. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియామకం అయినప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పదిహేను మంది ఉండే పొలిట్ బ్యూరోలో తనకు చోటు ఎందుకు..తనకు ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని ఆయన పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా తన సోదరి నారా భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో కొంత మంది అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశంపైనే ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ అకస్మాత్తుగా ఆహా షోలో వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించి బావోద్వేగానికి గురవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది ఆసక్తికర అంశంగా మారింది. ఇది అనుకోకుండా జరిగిందా? లేక కావాలనే బాలకృష్ణ ఈ అంశంపై స్పందించారా? అన్నది తేలాల్సి ఉంది. ఆహా లో నందమూరి బాలకృష్ణ గత కొన్నిరోజులుగా అన్ స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... వెన్నుపోటు తప్పుడు ప్రచారం. చెబుతుంటే కళ్ళెంట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని..ఆయన ఫ్యాన్స్ లో ఒకడిని అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ షోకు తాజాగా అఖండ చిత్ర యూనిట్ వచ్చింది. ఈ ప్రొమోను ఆహా యూట్యూబ్ లో విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా టాలీవుడ్ లో ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇందులో బాలకృష్ణ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. అఖండ సినిమాలో శ్రీకాంత్ చేసిన విలన్ పాత్ర ఎంతో బాగుందన్నారు. ఎవరైనా సరే రెడీగా ఉంటే తాను కూడా విలన్ గా యాక్ట్ చేయటానికి రెడీగా ఉన్నాను. ఆ వెంటనే..హీరో కూడా నేనే అంటూ ప్రకటించేశారు. తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ మీరు ప్రపంచానికి ప్రశ్నేమో..నాకు సమాధానం అంటూ బాలకృష్ణ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇందులో హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ బాలకృష్ణ , బోయపాటిని సర్ సర్ అంటూ సంభోదిస్తుంటే బాలయ్య మధ్యలో జోక్యం చేసుకుని సర్ సర్ క్యాహై అంటే..ఓకే బాలా అంటూ ప్రగ్యాజైస్వాల్ చిన్న ఝలక్ ఇస్తుంది. దీనికి కూడా బాలకృష్ణ అవాక్కుఅవుతాడు.