2021 మార్చిలో 95గా రాసిన ప్రముఖ పత్రికలు
2022లో 100 సంవత్సరాలు ఎలా వస్తాయి?
Full Viewప్రధాని నరేంద్రమోడీకి సంబంధించి మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అసలు నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ మోడీ వయస్సు ఎంత?. గత ఏడాది మార్చిలో తన తల్లి హీరాబెన్ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో మోడీ ఓ ట్వీట్ చేశారు. ఆ సమయంలో ఆయన ఆమె వయస్సు ప్రస్తావించకపోయినా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ వంటి ప్రముఖ పత్రికల్లో ఆ వార్తల్లో ఆమె వయస్సును 95 సంవత్సరాలుగా రాశాయి. మరి 2021లో 95 సంవత్సరాలు అయితే 2022కు ఏకంగా 100 సంవత్సరాలు ఎలా వస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలు పత్రికలకు సంబంధించి క్లిప్సింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత శనివారం నాడు ప్రధాని మోడీ తన తల్లి వందవ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా ఆమె కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. సహజంగా ఎవరైనా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అంటే చాలా గొప్ప విషయమే.
అందులో అత్యంత శక్తివంతంగా ఉన్న నరేంద్రమోడీకి అయితే ఇది మరింత ఆనందకర అంశమే. అయితే ఇక్కడ మరో అంశంపై కూడా భారీ ఎత్తున చర్చ సాగుతోంది. రెండుసార్లు ప్రధాని అయిన మోడీకి..దేశ, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆయన ఇమేజ్ ఓ రేంజ్ కు పెరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తల్లి వందవ సంవత్సర పుట్టిన రోజు వేడుకల్లో ఆయన ఎక్కడా తన సోదరులు..సోదరిని భాగస్వామిని చేసినట్లు కన్పించలేదు. అందరూ కలసి ఈ శుభ సందర్భంగా ఈ గ్రూప్ ఫోటో కూడా దిగినట్లు అయితే బయటకు ఏమీరాలేవు. కేవలం మోడీ, తల్లి హీరాబెన్ లు ఉన్న పోటోలు తప్ప మరేమి బయటకు రాలేదు. దీనిపై కూడా సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మోడీ ఎంత సెల్ఫ్ సెంట్రిక్ గా ఉంటారు అనటానికి ఇది ఓ ఉదాహరణంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.