ట్రంప్ పెంచిన కరోనా కేసులు 30 వేలు

Update: 2020-11-01 14:28 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ విడుదల చేసిన నివేదిక కలకలం రేపుతోంది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మరింత ఇరకాటంలోకి నెడుతోంది. ఈ నివేదికపై డెమాక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బైడెన్ మండిపడ్డారు. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో కరోనానే అత్యంత కీలక అంశంగా మారింది. ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవాలన్న ట్రంప్ ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. చివరకు ఆయనకు కరోనా బారిన పడాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించిన సభల వల్ల దాదాపు 30వేల మంది పౌరులు కరోనా వైరస్‌ పడగా.. మరో 700 మంది చనిపోయారని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ తన నివేదికలో పేర్కొంది.

వైరస్‌ వ్యాప్తిని ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలు ఉల్లంఘించిన ప్రచార ర్యాలీలు నిర్వహించడం కారణంగానే పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ మేరకు జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను బహిర్గతం చేసింది. తాజా రిపోర్టుపై డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడైన్‌ ఘాటుగా స్పందిస్తూ..అమెరికన్ల ప్రాణాలపై ట్రంప్‌కు ఏ బాధ్యత, గౌరవం లేదని విమర్శించారు.

Tags:    

Similar News