పశ్చిమ బెంగాల్ రాజకీయం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏకంగా తనపై దాడి జరిగిందని ఆరోపించారు. అంతే కాదు..అర్ధాంతరంగా ఆమె తన నందిగ్రామ్ పర్యటనను రద్దు చేసుకుని కోల్ కతా బయలుదేరి వెళ్లారు. రియాపాడ్ దేవాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు.
నందిగ్రామ్ పర్యటన సందర్భంగా ఆమెకు గాయాలు అయినట్లు మీడియాకు చూపించారు. తన పర్యటనలో పోలీసు భద్రతా ఏర్పాట్లు ఏ మాత్రం సరిగాలేవని విమర్శించారు. తాజాగా ఎస్ఈసీ పశ్చిమ బెంగాల్ డీజీపీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో మమతా బెనర్జీ భద్రతా ఏర్పాట్లపై ఆరోపణలు చేయటం కీలకంగా మారింది.