ఆయన ఏ సినిమా తీసినా వివాదాలు కామన్. వర్మ తీసే ప్రతి సినిమా కోర్టుల మెట్టు ఎక్కాల్సిందే. ఓ వైపు మర్డర్ సినిమా వివాదం సాగుతుండగానే మరో వైపు దిశ సినిమా వివాదం మొదలైంది. 'దిశ..ఎన్‌కౌంటర్' సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలు దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఆదివారం ఉదయం రాంగోపాల్ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. దిశ సినిమాను ఆపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డితో పాటు రాంగోపాల్ వర్మ ఇంటివద్ద తండ్రి మీద మహిళా సంఘాలు ఆందోళనకు దిగారు.
దిశ సంఘటన ఆధారంగా తీసిన సినిమా తక్షణమే ఆపేయాలని వీరు డిమాండ్ చేశారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలా జరిగితే ఆ ఇతివృత్తంతో సినిమా తీస్తారా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా అతి దారుణంగా హత్య చేయబడితే..దాని ఆధారంగా సినిమా గురించి ఎంత వరకు సమంజసమని మహిళా సంఘాలు ప్రశ్నించాయి. మహిళల దర్నాతో ఎమ్మెల్యే కాలనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ పోలీసులను మొహరించారు. రౌడీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటూ నినాదాలుచేశారు.