నిన్నటి వరకూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఒకరు ఒకరికి అసలు తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదంటే..మరొకరు మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మర్యాద ఉండదు అంటూ హెచ్చరించారు. వారిద్దరే ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు. గతంలో ఎన్నడూలేని రీతిలో విమర్శలు..ప్రతి విమర్శలు ఈ ఎన్నికల సమయంలో కన్పించాయి. అయితే విమర్శల తీరుకు భిన్నంగా కౌంటింగ్ రోజు వ్యవహరించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మా ప్రెసిడెంట్ బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఓటింగ్ సందర్భంగా కౌగిలించుకున్నారు. అంతే కాదు..ప్రకాష్ రాజ్ అయితే ఏకంగా మోహన్ బాబు కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే మోహన్ బాబు అడ్డుకున్ని రెండు భుజాలపై గట్టిగా చరిచి కౌగిలించుకున్నారు.
ఇలాంటి పరిణామాలు ఎన్నో మా ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ తో కూడా మోహన్ బాబు అప్యాయంగా మాట్లాడారు. అయితే ప్రకాష్ రాజ్ తో దిగిన ఫోటోను మంచు విష్ణు తన ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనికి .'వాటమ్మా ..వాట్ ఈజ్ దిస్ అమ్మా' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. మా అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రకాశ్‌రాజ్,మంచు విష్ణు కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన వీళ్లిద్దరూ మోహన్ బాబు సమక్షంలో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.