ఈ సినిమాలో సత్యతోపాటు ఇతర పాత్రలు కూడా టైమింగ్ కు అనుగుణంగా నటించి నవ్వులు పూయించాయి. ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ ప్రకటనతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక నవ్వులే..నవ్వులు. త్వరలో సోనీ లివ్ ఒటీటీ లో సినిమా విడుదల కానుంది. సత్యకు కొత్తగా పెళ్ళైన వెంటనే లాక్ డౌన్ పెడతారు. అయితే ఇంట్లో ఉన్న బంధువులను ఎలా పోషించాలా అని సత్య లెక్కలు వేసుకుంటాడు. కానీ ఇంట్లోని వాళ్లు అంతా సత్యకు చుక్కలు చూపిస్తారు. ఆ కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది తేలాలంటే సినిమా విడుదల కావాల్సిందే.