చిరు కెరీర్ లోనే స్పెషల్ మూవీ

Update: 2024-08-22 07:41 GMT

Full Viewచిరంజీవి మరో సారి విశ్వంభర సినిమాతో సంక్రాంతి రేసుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు..ఒక అద్భుతమైన తార పోరాటానికి ప్రకాశిస్తుంది అంటూ పేర్కొన్నారు. ఈ లుక్ లో చిరంజీవి చేతిలో త్రిశూలం పట్టుకుని కనిపిస్తాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. విశ్వంభర సినిమా లో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాగా ప్రచారం జరుగుతోంది.

                                                                          ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని టాలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం ఏకంగా 13 ప్రత్యేక సెట్స్ వేయటంతో సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా ఉండబోతున్నాయి. 2023 లో సంక్రాంతికి వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్య బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ దక్కించుకుంది. మరి ఇప్పుడు మరో సారి సంక్రాంతి బరిలో ఉండబోతున్న చిరంజీవి ఈ సోషల్ ఫాంటసీ మూవీ తో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారో వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News