మెకానిక్ రాకీ ట్రైలర్ అక్టోబర్ 20 న

Update: 2024-10-14 12:46 GMT

Full Viewవిశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్న మెకానిక్ రాకీ సినిమా విడుదల తేదీ మారింది. తొలుత ఈ సినిమాను దీపావళి రోజు అక్టోబర్ 31 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా లో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. రిలీజ్ డేట్ తో న్యూ లుక్ ను విడుదల చేయటంతో పాటు ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 20 న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎస్ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంటే...జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన మెకానిక్ రాకీ సినిమా సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి అక్టోబర్ 20 న విడుదల అయ్యే ట్రైలర్ సినిమాపై అంచనాలను ఏ మేరకు పెంచుతుందో వేచిచూడాలి. రవి తేజ ముళ్ళపూడి ఈ సినిమాకు కథ అందించటంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. 

Tags:    

Similar News