దస్ క ధమ్కీ. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ను బుధవారం నాడు విడుదల చేశారు. అంతే కాదు ఈ సినిమా ముహుర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. టైటిల్ ఆసక్తికరంగా ఉంది. దస్ క అన్నది చాలా చిన్నగా ఉంచి..ధమ్కీని టైటిల్ లో హైలెట్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలసి పాగల్ సినిమాలోనూ సందడి చేసిన విషయం తెలిసిందే. కామెడీ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. నరేష్ కుప్పిల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.