వేసవిలో తెలుగు సినిమాలో సందడి

Update: 2021-01-28 17:00 GMT

టాలీవుడ్ లో సమ్మర్ సందడి ఓ రేంజ్ లో ఉండేలా ఉంది. కరోనా కారణంగా తొమ్మిది నెలల పాటు పెద్ద సినిమాలు ఏమీ లేక అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు డల్ అయిపోయారు. కానీ ఈ డల్ నెస్ పోవటానికి వేసవి సందడి సిద్ధం అవుతోంది. ఏప్రిల్, మే నెలల్లో పెద్ద ఎత్తున సినిమాలను విడుదల చేసేందుకు పరిశ్రమ వర్గాలు రెడీ అయిపోతున్నాయి. అందులో భాగంగానే వరస పెట్టి విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. తాజాగా దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం సినిమా విడుదల తేదీ కూడా వచ్చేసింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. 1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో డా. రవి శంకర్‌ అలియాస్‌ న‌క్స‌లైట్ నాయ‌కుడు కామ్రేడ్‌ రవన్నగా రానా తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు. 'రివల్యూషన్‌ ఈజ్‌ యాన్‌ యాక్ట్‌ అఫ్‌ లవ్‌ అనే క్యాప్షన్‌ 'విరాటపర్వం' సినిమా థీమ్‌ను తెలియజేస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకోంటుంది. ఏప్రిల్‌ 30 న విరాటపర్వం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News