అదరగొట్టిన 'విరాటపర్వం టీజర్'

Update: 2021-03-18 12:00 GMT

 దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో రానా మావోయిస్టుగా..రచయితగా నటించినట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతోంది. రానా రచనలు చూసి సాయిపల్లవి ఆయన అభిమానిగా, ప్రేమికురాలిగా మారిపోతుంది.

రానా ను కలిసే సమయంలో సాయిపల్లవి ఎదుర్కొనే పోలీసుల వేధింపులతో టీజర్ కట్ చేశారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి రానా, సాయిపల్లవి లుక్స్ కూడా ఆసక్తిని పెంచాయి.

Full View

Tags:    

Similar News