'విరాటపర్వం' విడుదల కూడా వెనక్కి

Update: 2021-04-14 12:58 GMT
విరాటపర్వం విడుదల కూడా వెనక్కి
  • whatsapp icon

 కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. తొలి దశ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత అసలు గతంలో ఎన్నడూలేని రీతిలో వరస పెట్టి సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. ఎవరికి వారు డేట్స్ బ్లాక్ చేసుకునేలా ఈ ప్రక్రియ సాగింది. కానీ సడన్ గా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో విడుదల తేదీల ప్రకటించిన నిర్మాతలే వెనక్కి తగ్గాల్సి వస్తోంది. ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'విరాటపర్వం' సినిమా కూడా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

వాయిదా పడిన వాటిలో రెండు సినిమాలు సాయిపల్లవి ఉన్నవే కావటం విశేషం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను వెల్లడిస్తామని రానా వెల్లడించారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ ౩౦న విడుదల కావాల్సి ఉంది. 

Tags:    

Similar News