నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను

Update: 2021-12-25 09:18 GMT

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ స‌ర్కారు తాజాగా ప‌రిశ్ర‌మ కోరిన రీతిలో సినిమా టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై మెగాస్టార్ చిరంజీవి సీఎం కెసీఆర్ తోపాటు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్ప‌డు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను అంటూ కామెంట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేఃన‌న్నారు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలోనే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ అతి పెద్ద ప‌రిశ్ర‌మ అని అభివ‌ర్ణించారు.

Tags:    

Similar News