లైగర్ సినిమా షూటింగ్ అమెరికాలో జరగనుంది. భారీ షెడ్యూల్ కు ముందు లాస్ వెగాస్ లో దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ అనన్యపాండే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోకి మైక్ టైసన్ ను కూడా తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు చిత్ర యూనిట్. పాన్ ఇండియా సినిమాగా ఈ లైగర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను కరణ్ జోహర్, ఛార్మి కౌర్ మరికొంత మంది కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.