విజయదేవరకొండ 'లైగర్' లుక్ విడుదల

Update: 2021-01-18 05:15 GMT

సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ను..ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహర్ తోపాటు ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా తదితరులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ పాన్ ఇండియా సినిమా టైటిల్ 'ఫైటర్'గా ప్రచారం జరిగినా చిత్ర యూనిట్ అధికారికంగా 'లైగర్' అని ప్రకటించింది. లైగర్ అంటే లయన్ ప్లస్ టైగర్ అని అర్ధం వచ్చేలా లుక్ లో ఆ రెండు ఫోటోలతోపాటు బాక్సర్ లుక్ లో ఉన్న విజయదేవరకొండ కన్పిస్తారు.

ట్యాగ్ లైన్ గా సాలా క్రాస్ బ్రీడ్ అని పెట్టారు. ఈ సినిమాలో విజయదేవరకొండకు జోడీగా అనన్యపాండే నటిస్తోంది. ఇప్పటికే ముంబయ్ లో చాలా రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. కరోనా దెబ్బతో అన్ని సినిమాల తరహాలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. ప్రస్తుతం అంతా సాధారణ స్థితికి రావటంతో మళ్లీ సినిమా పనులు ప్రారంభించారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి విజయ్ ఫ్యాన్స్ ను కుషీ చేశారు. ఇది విజయదేవరకొండ పదవ సినిమా.

Tags:    

Similar News