వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలే వ్యక్తం అయ్యాయి. దగ్గర దగ్గర రెండు దశాబ్దాల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని ప్రకటన వచ్చిన వెంటనే ఈ మూవీ అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమా విడుదల పలు మార్లు వాయిదా పడటంతో రిలీజ్ కు ముందు ఆదర్శ కుటుంబం పై బజ్ బాగా తగ్గిపోయింది. ఫస్ట్ డే ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఫైనల్ గా సినిమా అక్టోబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా వెల్లడిస్తూ కలెక్షన్స్ తో కూడా న్యూ లుక్ ను విడుదల చేసింది. సోమవారం నాడు బుకింగ్స్ బాగా తగ్గిపోయాయి.

                                            Full Viewదీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల మార్క్ ను చేరుకుంటుందా లేదా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరో గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకీ కెరీర్ లోనే ఫస్ట్ టైం 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాంటిది త్రివిక్రమ్, వెంకటేష్ సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటుంది అని అంతా లెక్కలు వేసుకున్నారు. కానీ ఆదర్శ కుటుంబం సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్కువ మంది ఈ మూవీ లో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోలిస్తే కలెక్షన్స్ విషయంలో ఇది ఎక్కడో దూరంగా ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వెంకటేష్ కంటే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇబ్బందికర పరిస్థితి అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది.

Tags: