అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ

Update: 2026-06-27 13:08 GMT

Full Viewటాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ స్టైల్ వేరు. ఎక్కడా పెద్దగా హడావుడి చేయరు..తన పని తాను చేసుకుంటూ పోతారు. గత కొంత కాలంగా వెంకటేష్ హిట్ ట్రాక్ లో ఉన్నారు. ముఖ్యంగా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ కొట్టారు. ఆ తర్వాత .చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్ సినిమాలో కీలక పాత్రలో నటించి అందులోనూ వెంకటేష్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. అదే జోష్ తో వెంకటేష్ వరస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా తుది దశకు చేరుకుంది. మరో సారి హిట్ మెషిన్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

                         ఇందులో కళ్యాణ్ రామ్ మరో హీరోగా ఆన్నారు. ఆదర్శ కుటుంబం చిత్ర యూనిట్ శనివారం నాడు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. భార్య, ఇద్దరు పిల్లలతో వెంకీ ఈ పోస్టర్స్‌లో కనిపిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ దసరా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News