వచ్చే సమ్మర్ కు రిలీజ్

Update: 2025-12-10 06:58 GMT

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న హీరో వెంకటేష్. అయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా కూడా ఇది నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది పలు రికార్డులు నమోదు చేసింది. మరో వైపు వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి మూవీ మన శంకర వరప్రసాద్ గారు లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాలో తన షూటింగ్ పూర్తి కూడా చేసుకున్నారు. ఇది అలా పూర్తి అయిందో లేదో వెంకటేష్ కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ బుధవారం నుంచి స్టార్ట్ అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

                                 అంతే కాదు..ఈ సినిమా టైటిల్ తో హీరో వెంకటేష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ కి ఆదర్శ కుటుంభం అనే పేరు పెట్టారు. ట్యాగ్ లైన్ కింద హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్ గా పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ హారిక హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. టైటిల్ తో పాటు వచ్చే సమ్మర్ లో ఈ సినిమా విడుడల ఉంటుంది అని కూడా ప్రకటించారు. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎప్పటిలాగానే ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది టాలీవుడ్ టాక్.

Tags:    

Similar News