Full Viewపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇక పండగే. అయన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం విడుదల చేసింది. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే గబ్బర్ సింగ్ సినిమా లో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ పోలీస్ అధికారిగానే కనిపిస్తున్నారు. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీ లీల సందడి చేయనుంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘ ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మం వృద్ధి నొందునే ఆయా సమయములందు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్న ’ అంటూ భగవత్గీత శ్లోకం వస్తున్న తరణంలో పవన్ కళ్యాణ్ నోటి నుంచి భగత్..భగత్ సింగ్ అంటూ డైలాగు రావటం...మహంకాళి పోలీస్ స్టేషన్ పత్తర్ గంజ్ ..పాతబస్తి. ఈ సారి పెర్ఫార్మన్స్ బద్దలైపోద్ది. ’ అనే డైలాగులతో పవన్ కళ్యాణ్ గ్లింప్స్‌లో సందడి చేశారు.