'ఉప్పెన' మూవీ రికార్డు సృష్టించింది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పది కోట్ల రూపాయల షేర్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఓ హీరో తొలి సినిమా ఇంత భారీ వసూళ్లు సాధించటంపై చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. భారీ అంచనాల మధ్య ఉప్పెన సినిమా శుక్రవారం నాడు విడులైన విషయం తెలిసిందే. అయితే సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నా...సెకండాఫ్..క్లైమాక్స్ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతిశెట్టి సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది.
దీంతోపాటు హీరో నటనతోపాటు విజయ్ సేతుపతి యాక్షన్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమా నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వరుసగా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబట్టింది. మొదటి రోజు భారీ స్థాయలో కలెక్షన్లు సాధించటం ద్వారా డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను వంద శాతం అనుమతిస్తుండటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది.